అనంతపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

5చూసినవారు
AP: అనంతపురం జిల్లా కంబదూరు మండలం కురాకులపల్లి గ్రామంలో అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం కాలిన ఆనవాళ్లను గమనించిన గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్