ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లకు రుణాలు

33చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లకు రుణాలు
ఏపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేస్తోంది. గతంలో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడటంతో ఇబ్బందులు తలెత్తాయి. అయితే, CM చంద్రబాబు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లతో చర్చలు జరిపిన తర్వాత, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. దీంతో 365 చ.అ. ఇళ్లకు రూ.3.15 లక్షలు, 430 చ.అ. ఇళ్లకు రూ.3.65 లక్షల చొప్పున రుణాలు లభించనున్నాయి. తద్వారా డిసెంబర్‌లో 20 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించే మార్గం సుగమమైంది.

సంబంధిత పోస్ట్