పులి సంచారం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

19చూసినవారు
పులి సంచారం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
AP: ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. పులి కదలికలు, దాని సంచార ప్రాంతాలకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్