AP: ఏలూరు జిల్లా, ముసునూరు మండలం రమణక్కపేట అడవిగట్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ తెలిపారు. ఈ పులి రాత్రి వేళల్లో మాత్రమే ప్రయాణిస్తోందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల దిగవల్లి, కొండపర్వ గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తమ పశువులు, మేకలను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లవద్దని అధికారులు సూచించారు.