AP: ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం నాళ్లవరం పంచాయతీ పరిధిలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కరాటం బ్రహ్మయ్యకు చెందిన ఒక ఆవు మరియు రెండు దూడలను పెద్దపులి వేటాడి చంపినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ అధికారులు, పులి సంచారం నేపథ్యంలో గ్రామస్థులు ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.