ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక దాడి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Oct 14, 2026, 02:10 IST/

16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక దాడి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Oct 14, 2026, 02:10 IST
జర్మనీలోని హోహెన్‌జోల్లెర్న్‌రింగ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలిక పట్ల సుమారు 1.2 మీటర్ల ఎత్తు ఉన్న రోబో అసభ్యంగా ప్రవర్తించింది. పోలీసుల విచారణలో ఇద్దరు యువకులు రిమోట్ ద్వారా రోబోను నియంత్రించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. వారు ఈ తతంగం సోషల్ మీడియాలో లైవ్‌స్ట్రీమ్ చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన 16 ఏళ్ల బాలుడు రోబోను కారు డిక్కీలో దాచిపెట్టగా, పోలీసులు దానిని, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపులు, దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.