
పేరూరు ప్రీమియర్ లీగ్ విజేతగా ఇస్కాన్ వారియర్స్
తిరుపతిలోని తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్స్‌లో 20 రోజుల పాటు జరిగిన పేరూరు ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో ఇస్కాన్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌కు సుమారు 70 జట్లు హాజరయ్యాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విజేత ఇస్కాన్ వారియర్స్‌కు ట్రోఫీతో పాటు రూ. 20,999 నగదు బహుమతిని ఆదివారం అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన గొల్లపల్లి ఎలెవన్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 10,999 నగదు బహుమతిని అందించారు. టోర్నీ నిర్వాహకుడు చెంచు మోహన్ యాదవ్‌ను, క్రీడాకారులను చెవిరెడ్డి అభినందించారు.

































