
పెనుమూరులో పోలీసుల ఏరియా డామినేషన్
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో పోలీసులు ఏరియా డామినేషన్ నిర్వహించారు. ఈస్ట్ సర్కిల్ సీఐ కె. రామచంద్ర, పెనుమూరు ఎస్ఐ శ్రీకాంత్, ఎన్. ఆర్. పేట ఎస్ఐ మణికంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల పరిసరాలను పరిశీలించారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో అనుమతి లేని వ్యక్తులు గుమిగూడరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.







































