చిత్తూరులోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 24న, శనివారం భారీ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 500కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనుండగా, అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుండి రూ.30,000 వరకు జీతభత్యాలు లభించే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు మంగళవారం సూచించారు.