Oct 21, 2026, 11:10 IST/
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు రూ.15 వేల ప్రోత్సాహకం
Oct 21, 2026, 11:10 IST
భారతదేశంలో తొలిసారిగా ఉద్యోగాల్లో చేరుతున్న యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని సంస్థల్లో చేరే ఉద్యోగులకు రూ.15,000 నగదు ప్రోత్సాహకాన్ని మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్ఓలో నమోదు కాని వారు, నెలవారీ వేతనం లక్ష రూపాయల లోపు ఉన్నవారు దీనికి అర్హులు. దీని కోసం ఆధార్, యూఏఎన్, బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.