గూడూరులో టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు

1చూసినవారు
తిరుపతి జిల్లా గూడూరు మండలం, రామలింగాపురం పంచాయతీలో సోమవారం రాజకీయ మార్పు చోటు చేసుకుంది. వైసిపిని వీడి గుడిపాటి కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ నీలం సుబ్బా రెడ్డిలతో పాటు 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పి సునీల్ కుమార్ స్వయంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వీరు పార్టీలో చేరారని, వారికి పార్టీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్