వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా, శనివారం కుప్పం పీఈఎస్ కళాశాల వద్దనున్న పీజీ హాస్టల్స్ను డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాళ్ళబుదుగురు, రామకుప్పం ఎస్ఐలు నరేష్, వెంకట మోహన్ తదితరులు పాల్గొన్నారు.