
నగరి మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవ ప్రకటనపై కలెక్టర్ ను కలిసిన రోజా
చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్‌ను కలిసిన మాజీ మంత్రి ఆర్.కే. రోజా. నగరి మున్సిపల్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మ్-4లో వైసీపీ అభ్యర్థి బాలకృష్ణన్ పేరు చేర్చి, ఎన్నికలు నిర్వహించాలని కోరారు. హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కాపీని కలెక్టర్‌కు అందజేశారు.

























