పలమనేరు - Palamaner

పలమనేరులో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ యూనిట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని ఆటోనగర్–ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ప్రాంతంలో గురువారం,  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మోటార్స్ యూనిట్‌ను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ప్రారంభించారు. ఈ యూనిట్‌ను స్థానిక వ్యాపారవేత్త లోకనాథ రెడ్డి నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా పరిశ్రమల స్థాపన వల్ల ఆర్థిక పురోగతితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవీంద్ర బాబు, టీడీపీ నేతలు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా