
స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు: భాను ప్రకాష్
బంగారుపాళ్యం మండలం పార్టీ కార్యాలయంలో సోమవారం పూతలపట్టు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ భాను ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. టీడీపీతో పొత్తుపై స్పష్టత లేకపోవడంతో, సొంత బలంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి, స్థానిక సమస్యలపై ప్రజల్లోకి వెళ్తామని ఆయన పేర్కొన్నారు.






















