
తిరుపతి హోటల్ లో అన్నంలో పురుగులు కలకలం
తిరుపతి బస్టాండ్ సమీపంలోని హోటల్ మంజునాథ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం నగిరి ప్రాంతానికి చెందిన రూపేష్ అనే వ్యక్తి భోజనం చేయడానికి వెళ్లారు. అక్కడ అతను ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్‌లో విషపురుగు కనిపించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యాన్ని నిలదీసినా వారు సరైన రీతిలో స్పందించలేదని రూపేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రతిరోజూ వేలమంది యాత్రికులు వచ్చే చోట ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.



























