
కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి
బంగారుపాళ్యం మండలంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం వంటి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





































