
పోలేరమ్మ గుడి చుట్టూ డ్రైనేజీ నీరు
తిరుపతి, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులమిట్టలో డ్రైనేజీ కాలువ నిండి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలేరమ్మ గుడి చుట్టూ నీరు నిలిచిపోవడం, రాబోయే జాతర నేపథ్యంలో భక్తులకు మరింత అసౌకర్యం కలగనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు.






















