AP: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం గుణుపూడి బ్రిడ్జి పేటలో రాజేష్ (36) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. భవనం పైనుంచి పడి అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.