ట్రాన్స్‌జెండర్ల గ్రూప్ వార్.. ఒకరి మృతి

32చూసినవారు
ట్రాన్స్‌జెండర్ల గ్రూప్ వార్.. ఒకరి మృతి
AP: అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య జరిగిన గ్రూప్ వార్‌లో ఒకరు మరణించారు. వినాయకమండపం ఆహ్వానం విషయంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం కర్రలు, కత్తులతో దాడికి దారితీసింది. ఈ దాడిలో చరణ్ అనే ట్రాన్స్‌జెండర్ తీవ్రగాయాలతో మరణించగా, అతడి సోదరుడు వీరేష్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరే హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్