కాలువలో జారిపడి ఇద్దరు బాలురు గల్లంతు

3చూసినవారు
కాలువలో జారిపడి ఇద్దరు బాలురు గల్లంతు
AP: కృష్ణా జిల్లా, పామర్రు పరిధిలోని గాంధీనగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుల్లేరు కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని గాంధీనగర్‌కు చెందిన అల్లాడ అమరేందర్ (13), పామర్తి కౌశిక్ (11)గా గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాలుర కోసం కాలువలో స్థానికులు మరియు అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్