AP: వారం రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్టోబర్ 28న అర్నబ్ తుఫాను నరసాపురం సమీపంలో తీరం దాటగా, గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనంతరం నవంబర్ 3న మురసు తుఫాను కొత్తపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 21.69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.