ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో యువత సత్తా చాటారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేటలో
టీడీపీ బలపరిచిన 22 ఏళ్ల శివసాహితి 93 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచారు. అలాగే ఒంగోలు మండలం మండవవారిపాలెం పంచాయతీలో
టీడీపీ మద్దతుదారు 23 ఏళ్ల కొండాబత్తిన యశస్విని 151 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలి విడతలోనే ఇలా యువత సర్పంచులుగా ఎన్నికవ్వడం విశేషం. ఈ విజయం పట్ల వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.