AP: మార్కాపురం జిల్లా కోమరోలు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.