AP: ప్రకాశం, బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలోని వీధికి ఒకవైపు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె. రాజుపాలెం ఉండగా, మరోవైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం ఉంది. దీనివల్ల ఒకే వీధి ప్రజలు వేర్వేరు జిల్లాలు, మండలాలకు చెందుతున్నారు. భౌగోళిక సరిహద్దుల కారణంగా ఎన్నికల సమయాల్లో మాత్రమే గ్రామస్తులకు తాము వేర్వేరు గ్రామాల వారమనే విషయం గుర్తొస్తుంది. ఈ అరుదైన పరిస్థితి స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.