AP: అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నక్కపల్లి మండలం పెదబోదుగాలం, రేబాక గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు వీసం నానాజీ, వీసం దేవి వైసీపీని వీడి
టీడీపీ గూటికి చేరారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో వీరు
టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా గెలిచి, కొన్ని రోజుల్లోనే వారిద్దరూ పార్టీ మారడంతో
వైసీపీ శ్రేణులు షాక్ అవుతున్నారు.