టీడీపీ MPPగా మహిళా ఎన్నారై ఏకగ్రీవం

27చూసినవారు
టీడీపీ MPPగా మహిళా ఎన్నారై ఏకగ్రీవం
AP: ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండల ఎంపీపీగా ఎన్నారై తారాబాయి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు మండల పరిషత్తు కార్యాలయంలో ఈ ఎన్నిక జరిగింది. అమెరికాలో ఐటీ, రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు చేస్తున్న తారాబాయి, తన తల్లిదండ్రుల స్వగ్రామమైన ఎనికపాడు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తద్వారా ఆమె ఇప్పుడు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్