కర్నూలులో నిరుద్యోగుల నిరసన (వీడియో)

20చూసినవారు
AP: కర్నూలులోని బిర్లా కాంపౌండ్ వద్ద నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. 11,639 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాకినాడలో అభ్యర్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఇకపై ఉద్యోగాల కోసం పోరాడే యువతపై కేసులు పెట్టకూడదన్నారు. తమను ఎవరో ప్రలోభపెడుతున్నారని చెప్పడం తమ పోరాటాన్ని అవమానించడమేనని అన్నారు. తమ భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్