ఏపీలో నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ ఎన్నికల
ఫలితాలు రేపు (మంగళవారం) వెలువడనున్నాయి. ఈ నెల 1న 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ నిర్వహించారు. వీటిలో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 60.96 శాతం పోలింగ్ నమోదైంది. 2021 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 65.08 శాతం ఓటింగ్ నమోదైంది.