AP: మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కరవుతో అల్లాడే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల కల నెలవేరింది. శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేయనున్నాయి. 19 కి.మీ పొడవైన సొరంగాల నుంచి నీరు ఫీడర్ కెనాల్లోకి చేరి జలకళ సంతరించుకుంది. దాంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.