
ఇకపై సంక్షేమ పథకాలకు ఆధార్, రేషన్ కార్డులే నివాస రుజువులు!
AP: రాష్ట్ర ప్రభుత్వం నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక మార్పులు చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పొందడానికి ఆధార్, రేషన్ కార్డులనే నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, పీవీటీజీ (PVTG) గిరిజనులు, కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ఉద్యోగాలు, సైనిక బలగాల రిక్రూట్మెంట్కు మాత్రం తహసీల్దార్ జారీ చేసే సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ నిర్ణయంతో ప్రజలకు సమయం ఆదా కానుంది.




