ఈరోజు అత్యంత భారీ వర్షాలు

3చూసినవారు
AP: అర్నబ్ తుపాను బుధవారం నాడు యానానికి దక్షిణంగా, నరసాపురం సమీపంలో తీరాన్ని దాటింది. ఈ తీవ్ర తుపాను ప్రభావంతో బుధవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను అధికారులు ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్