
మీ పేరు మీద సిమ్ను వేరొకరు వాడుతున్నారా.. రూ.50 లక్షల వరకు జరిమానా
మీ పేరుపై ఉన్న సిమ్ కార్డును ఇతరులు దుర్వినియోగం చేస్తే తీవ్ర చట్టపరమైన చిక్కులు తప్పవని టెలికాం శాఖ (DoT) హెచ్చరించింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 ప్రకారం, మోసపూరితంగా సిమ్ పొందడం లేదా IMEI ట్యాంపరింగ్ చేస్తే గరిష్ఠంగా 3 ఏళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో 'సంచార్ సాథీ' పోర్టల్ ద్వారా తెలుసుకుని, అనవసరమైన నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.




