AP: తిరుమలలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వాతావరణం మారి వాతావరణం, ఉరుములు, మెరుపులతో సుమారు 30 నిమిషాల పాటు భారీ వర్షం పడింది. ఆలయ పరిసరాల్లోని భక్తులు వర్షంలో తడుస్తూ షెడ్ల కిందకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తడుచుకుంటూ క్యూ లైన్లలోకి ప్రవేశించారు. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన భక్తులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.