AP: విశాఖలో అర్నబ్ తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ కారణంగా నగరంలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ వృక్షం ఇంటిపై పడి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న మున్సిపల్ మరియు విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, చెట్లను తొలగించి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.