AP: పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, బూత్ ఏజెంట్లు వస్తున్నారనే సమాచారంతో రిటర్నింగ్ అధికారి (మున్సిపల్ కమిషనర్) కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు కార్యాలయ మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రీపోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల వైఖరి పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిరసనకు దిగారు.