VIDEO: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

6చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం–తాళ్లపూడి రోడ్డులో పెద్దాపురం వద్ద హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా బస్సు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన తాళ్లపూడి ఎస్ఐ సుబ్రహ్మణ్యం స్థానిక రైతుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, ట్రాక్టర్ల సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్