AP: ప్రొద్దుటూరు, కొత్తపల్లిలోని నామినేషన్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి. పోలీసుల సహకారంతోనే టీడీపీ నాయకులు తమ నామినేషన్ పత్రాలను చించేస్తున్నారని, అడ్డుకోవాల్సిన పోలీసులే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.