VIDEO: జమ్మలమడుగులో ఉద్రిక్తత

10చూసినవారు
AP: జమ్మలమడుగులో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, నామినేషన్ వేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. అయితే, గుండ్లకుంటలోని ఆమె స్వగృహం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, ఎవరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. తాము చట్టప్రకారం నామినేషన్ వేస్తామని ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి పట్టుబడుతుండటంతో పోలీసులు, వారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్