AP: బాపట్ల జిల్లా, చీరాలలోని పేరాల శివాలయం సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు ముందు దుండగులు సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.