AP: అనంతపురం జిల్లా, డి.హిరేహాల్ మండలం కల్యం గ్రామం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున రైల్వే ట్రాక్‌పై రెండు ఎలుగుబంటి పిల్లలు విగతజీవులుగా కనిపించాయి. మృతి చెందినవి రెండేళ్లలోపు వయసున్న పిల్లలుగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అధికారులు, పోస్టుమార్టం నిర్వహించి ఎలుగుబంట్లను ఖననం చేశారు.