VIDEO: పులివెందులలో వాహనాలకు నిప్పు

36చూసినవారు
AP: మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందుల శిల్పారామం వద్ద అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు 10 బైకులు, 3 కార్లు, ఒక ట్రాక్టర్ కు నిప్పు పెట్టారు. మంటలు అంటుకోవడంతో సుమారు 8 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్