AP: పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద మాజీ సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన తన పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ
వైసీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.