
ఢిల్లీలో ప్రధాని మోడీతో యువత భజన్ క్లబ్బింగ్
ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్క్లో శుక్రవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యువతతో కలిసి 'భజన్ క్లబ్బింగ్'లో పాల్గొన్నారు. సంప్రదాయ భక్తి గీతాలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ, కంజర వాయిస్తూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది యువతే పాల్గొనడం విశేషం.






















