
అమరావతి నిర్మాణంలో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యం
రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అర్బన్ ఇన్నోవేషన్ అండ్ సస్టెయినబిలిటీ (యూఆర్బీఐఎస్) సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు, నిపుణులతో కలిసి యూఆర్బీఐఎస్ పనిచేయనుంది.




































