బొబ్బిలి - Bobbili

మాజీ సైనికుల ఇళ్ల స్థలాల జీవో సవరించాలి.. కెవిఎస్ ప్రసాదరావు

మాజీ సైనికుల ఇళ్ల స్థలాల జీవో సవరించాలి.. కెవిఎస్ ప్రసాదరావు

బొబ్బిలి పాత కోటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం మాజీ సైనికుల సమస్యలపై అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. జిల్లా సైనిక అధికారి కెవిఎస్ ప్రసాదరావు హాజరై, పలువురికి డిపెండెంట్ కార్డులు అందజేశారు. ఆస్తి పన్ను, పుట్టిన తేదీ, చిరునామా మార్పులపై మార్గదర్శకాలు ఇచ్చారు. జీవో 63 ప్రకారం 5 ఎకరాల భూమి కేటాయించడంలో జాప్యంపై మాజీ సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో సవరించి కనీసం 5 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.