చీపురుపల్లి - Cheepurupalli

చీపురుపల్లిలో వైసీపీకి భారీ షాక్

చీపురుపల్లిలో వైసీపీకి భారీ షాక్

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. మెరకముడిదాం మండలంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైకాపా మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు ఆ పార్టీ వీడారు. ఆదివారం ఆయా నేతలు తమ రాజీనామా పత్రాలను వైకాపా అధ్యక్షుడు జగన్ కు పంపుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఆ పార్టీని వీడి తెదేపాలో చేరగా ఆయన వెంటే తామంతా నడుస్తామని తాజాగా రాజీనామా చేసిన నేతలు తెలిపారు. వీరంతా త్వరలో తెదేపాలో చేరనున్నారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా