
నైతిక విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలి
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం సాయంత్రం గజపతినగరంలోని సమవి కళాశాలలో మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు ఉపయోగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోపి, ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు, పిఎసిఎస్ చైర్మన్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.




































