గుమ్మ లక్ష్మీపురం - Gumma Lakshmipuram

నిర్మల్ జిల్లా
Sep 07, 2026, 16:09 IST/నిర్మల్
నిర్మల్

బాసర పాపేశ్వరాలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు

Sep 07, 2026, 16:09 IST
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ పాపేశ్వర ఆలయంలో శ్రావణ చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు నాగేష్ అప్ప ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, అర్చన, అన్నపూజ జరిగాయి. పంపట్వార్ కళ్యాణి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. గ్రామ దేవతగా గ్రామ రక్షకుడిగా పాపేశ్వర స్వామిని కొలవడం ఆనవాయితీ అని స్థానికులు తెలిపారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణతో బాసర పులకించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.