Sep 02, 2026, 13:09 IST/
రైతులకు శుభవార్త: ఇంటి నుంచే ఎరువుల బుకింగ్‌కు కొత్త యాప్
Sep 02, 2026, 13:09 IST
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 'FFS' అనే నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పట్టాదారు పాస్‌బుక్ లేని రైతులు కూడా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ఎరువులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి, పారదర్శకంగా పంపిణీ చేయడం, రైతులు క్యూలైన్లలో నిలబడే శ్రమను తగ్గించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం.